తెలంగాణలో కొత్తగా 605 కరోనా కేసులు
04-07-2021 Sun 20:34
- తెలంగాణలో కరోనా తగ్గుముఖం
- గత 24 గంటల్లో 71,800 కరోనా టెస్టులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 107 కేసులు
- రాష్ట్రంలో 7 మరణాలు
- ఇంకా 11,964 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 71,800 కరోనా పరీక్షలు నిర్వహించగా, 605 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 107 కొత్త కేసులు నమోదయ్యాయి. నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 1,088 మంది కరోనా నుంచి కోలుకోగా, ఏడుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,26,690 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,11,035 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 11,964 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,691కి చేరింది.
More Latest News
హైదరాబాదులో 'పక్కా కమర్షియల్' ప్రీ రిలీజ్ ఈవెంట్... ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి
4 hours ago
