సిరిసిల్లలో పర్యటిస్తున్న కేసీఆర్.. లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాల పంపిణీ
04-07-2021 Sun 12:48
- 27 ఎకరాల విస్తీర్ణంలో 1320 డబుల్ బెడ్రూం ఇళ్లు
- లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించిన కేసీఆర్
- హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సిరిసిల్లకు సీఎం

తెలంగాణ మఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేడు సిరిసిల్లలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సిరిసిల్ల చేరుకున్న కేసీఆర్ తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద 27 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ టు పద్ధతిలో రూ. 83.37 కోట్ల వ్యయంతో నిర్మించిన 1320 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు.
అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి గృహప్రవేశం చేయించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, మంత్రులు నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు కేసీఆర్‌కు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.
More Latest News
రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు... వాహనదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాలన్న పోలీసులు
9 hours ago

తెలంగాణలో మరో 476 మందికి కరోనా పాజిటివ్
9 hours ago

తెలంగాణలో ఒక పార్లమెంటు, 4 అసెంబ్లీ నియోజక వర్గాలకు టీడీపీ ఇంచార్జీల నియామకం... జాబితా ఇదిగో
10 hours ago
