కత్తి మహేశ్ చికిత్సకు రూ. 17 లక్షలు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం

02-07-2021 Fri 16:52
advertisement

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేశ్ కు ఏపీ ప్రభుత్వం ఆర్థికసాయాన్ని అందించింది. గత నెల 26న కారులో వెళ్తున్న మహేశ్ ఎదురుగా వెళ్తున్న లారీని వేగంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయమైంది. కళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్య చికిత్సకు గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సాయం చేసింది. రూ. 17 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ కింద అపోలో ఆసుపత్రికి చెల్లించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement