సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

02-07-2021 Fri 07:26
advertisement

*  ఇటీవల 'సుల్తాన్' సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కథానాయిక రష్మిక త్వరలో స్టార్ హీరో విజయ్ సరసన ఓ తమిళ సినిమాలో నటించే అవకాశం వుంది. విజయ్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'బీస్ట్' సినిమాలో ఇద్దరు హీరోయిన్లు వుంటారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా పూజ హెగ్డేని తీసుకున్నారు. మరో కథానాయిక పాత్ర కోసం రష్మికతో ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయట.
*  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'అన్నాత్తే' చిత్రం విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. దీపావళి సందర్భంగా నవంబర్ 4న ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఇందులో హీరోయిన్లు నయనతార, కీర్తి సురేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  
*  నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్యామ్ సింగ రాయ్' చిత్రం చివరి షెడ్యూలు షూటింగు నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది. ఇందులో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ కథానాయికలుగా నటిస్తున్నారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement