తనను భారత్‌కు అప్పగించొద్దంటూ లండన్ హైకోర్టులో నీరవ్ మోదీ అప్పీలు

30-06-2021 Wed 08:50
Nirav Modi renews UK extradition appeal to be heard on July 21st

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ.. తనను భారత్‌కు అప్పగించొద్దంటూ లండన్ హైకోర్టును ఆశ్రయించాడు. రెండేళ్లుగా లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉంటున్న నీరవ్ మోదీని భారత్‌కు రప్పించేందుకు సీబీఐ, ఈడీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన మరోమారు లండన్ హైకోర్టును ఆశ్రయించారు. గతంలోనూ ఓసారి అప్పీల్ చేయగా న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఈసారి తమ వాదనలను నేరుగా వినాలని నీరవ్ తరపు న్యాయవాదులు అప్పీలు చేశారు. దీంతో జులై 21న వాదనలు వినేందుకు న్యాయస్థానం అనుమతి నిచ్చింది.

కాగా, 19 మార్చి 2019 నుంచి జైలులోనే ఉంటున్న 50 ఏళ్ల నీరవ్.. పలుమార్లు పెట్టుకున్న బెయిలు దరఖాస్తులను ‘ఫ్లైట్ రిస్క్’ను కారణంగా చూపిస్తూ కోర్టు తిరస్కరించింది. కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ బంధువు మెహుల్ చోక్సీ ప్రస్తుతం డొమినికాలో పోలీసుల నిర్బంధంలో ఉన్నాడు.


More Telugu News
Team India tour in South Africa in jeopardy after new variant emerged
VIL set new record in five g spectrum trials
Green eyed woman from Aghanistan goes to Italy
Allu Arjun as chief guest for Dhee grand finale
Greater Hyderabad corona update
These three states are poor in country as per Niti Aayog latest poverty index
CM Jagan held meeting with YCP MPs
Central team visited flood damaged areas in Chittoor district
Chiranjeevi donates three lakh rupees for Shivshankar Master family
Center set to allow international flights from next month
Allu Arjun in Radhakrishna Kumar movie
AP Corona media report
Republic movie releases on ZEE5 as Saitej watched the movie along with unit members
Harish Rao says Telangana govt provides Bone Marrow Transplantation for free of cost under Arogya Sri
 Corona new variant likely spreads from immunity compromised person
..more