దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాకు జైలుశిక్ష!
30-06-2021 Wed 06:50
- 15 నెలల జైలుశిక్ష విధించిన సుప్రీంకోర్టు
- కోర్టుకు హాజరు కాకపోవడమే కారణం
- కోర్టును ధిక్కరించారన్న న్యాయమూర్తి

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాకు ఆ దేశ సుప్రీంకోర్టు 15 నెలల జైలుశిక్షను విధించింది. ఆయన అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో అవినీతికి పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై జరుగుతున్న విచారణకు జుమా హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఈ శిక్షను విధించారు. ఆయన కోర్టును ధిక్కరించారని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
జుమా ఏదైనా పోలీస్ స్టేషన్ లో ఐదు రోజుల్లోగా లొంగిపోవాలని లేకుంటే, అరెస్ట్ కు ఆదేశాలు జారీ చేస్తామని ఆయన అన్నారు. కాగా, ప్రస్తుతం 79 సంవత్సరాల వయసులో ఉన్న జుమా, 2009 నుంచి 2018 వరకూ అధ్యక్షుడిగా పనిచేశారు.
More Latest News
పోలీసు తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఫొటో, వీడియో ఇదిగో
1 hour ago

‘అమ్మా.. నిన్ను మిస్సవుతున్నాం’.. శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా జ్ఞాపకాలను పంచుకున్న జాన్వి, ఖుషి
2 hours ago

ఆ వీడియో మార్ఫింగ్ చేసినదే... గోరంట్ల మాధవ్ వీడియోపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ వ్యాఖ్య
2 hours ago
