రాజకీయాల నేపథ్యంలో ధనుశ్ .. శేఖర్ కమ్ముల మూవీ?

24-06-2021 Thu 12:09
advertisement

శేఖర్ కమ్ముల .. ధనుశ్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుంది. నారాయణ దాస్ నారంగ్ - రామ్మోహన్ రావ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథా నేపథ్యం ఏమై ఉంటుందనే ఆసక్తి అందరిలో మొదలైంది. తమిళనాడు రాజకీయాలతో ముడిపడిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా కథను రెడీ చేసుకున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. పొలిటికల్ టచ్ తో .. శేఖర్ కమ్ముల మార్కుతో ఈ కథ నడుస్తుందని అంటున్నారు.

తెలుగు .. తమిళ భాషలతో పాటు హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా కోసం ధనుశ్ అందుకునే పారితోషికం 30 కోట్లు అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ధనుశ్ జోడీగా సాయిపల్లవిని తీసుకునే ఆలోచనలో శేఖర్ కమ్ముల ఉన్నాడని అంటున్నారు. తెలుగులో శేఖర్ కమ్ముల - సాయిపల్లవి కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది. అలాగే ధనుశ్ - సాయిపల్లవి జంటకి తమిళనాట మంచి ఆదరణ ఉంది. అందువలన ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement