సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

23-06-2021 Wed 07:42
advertisement

*  నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న 'లవ్ స్టోరీ' సినిమాలోని 'సారంగ ధరియా' పాట ఎంతో పాప్యులర్ అయిన సంగతి తెలిసిందే. యూ ట్యూబ్ లో ఈ పాట అత్యధిక వ్యూస్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. తాజాగా ఇది 250 మిలియన్ల వ్యూస్ కు పైగా పొంది సరికొత్త రికార్డును సృష్టించింది.
*  పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ చిత్రానికి సంబంధించిన తదుపరి షూటింగు త్వరలో ప్రారంభం అవుతుంది. ఇందుకోసం పోలీస్ స్టేషన్ సెట్స్ ను వేస్తున్నారు. ఇందులో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన 30 శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.
*  దర్శకుడు శేఖర్ కమ్ముల తొలిసారిగా భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ధనుష్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో శేఖర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. దీనిని 120 కోట్ల బడ్జెట్టుతో నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement