గాళ్ ఫ్రెండ్ ఐఫోన్ కావాలంటోందని విజ్ఞప్తి చేసిన నెటిజన్... ఫన్నీగా స్పందించిన సోనూ సూద్ 

22-06-2021 Tue 21:46
advertisement

సాయం కావాలని అడగడమే తరువాయి, తన శక్తిమేర సాయపడుతూ ఆపద్బాంధవుడిలా గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్ కు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు విచిత్రమైన అభ్యర్థనలు ఎదురవుతుంటాయి.  అలాంటి వాటి పట్ల ఆయన చాలావరకు సరదాగా స్పందిస్తుంటారు. తాజాగా ఓ నెటిజన్ తన గాళ్ ఫ్రెండ్ ఐఫోన్ కావాలంటోందని, మీరు సాయం చేయగలరా? అంటూ సోనూ సూద్ కు ట్వీట్ చేశాడు. దానికి సోనూ సూద్ ఇచ్చిన రిప్లయ్ ఏంటో చూడండి! "నాకు ఆ విషయం తెలియదు కానీ, నీ గాళ్ ఫ్రెండ్ కు నేను ఫోన్ ఇస్తే ఇక నీకెలాంటి ప్రయోజనం ఉండదు!" అని కొంటెగా బదులిచ్చారు. ఈ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement