ప్రియుడితో పారిపోయిన చెల్లెలు.. కాల్చి చంపిన అన్న

22-06-2021 Tue 13:17
advertisement

ప్రియుడితో పారిపోయిన బాలికను ఆయన అన్న కాల్చి చంపేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లా చుర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే 16 ఏళ్ల అంజలి అనే బాలిక గౌరవ్ అనే యువకుడిని ప్రేమించింది. ఇటీవలే అతనితో కలిసి పారిపోయింది. ఈ ఘటనపై సదరు బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆమె ఇంటికి తిరిగొచ్చింది.

అయితే, ఆమె వల్ల తమ పరువు పోయిందని అప్పటికే ఆగ్రహంగా ఉన్న ఆమె సోదరుడు శేఖర్... ఇంట్లో ఆమె పని చేసుకుంటూ ఉండగా తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై బాలిక మామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement