శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసిన టీటీడీ

22-06-2021 Tue 11:11
advertisement

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులకు శుభవార్త. జులై నెలకు గాను స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. రోజుకు 5 వేల టికెట్ల వంతున జులై నెల కోటాను విడుదల చేసింది. రూ. 300 దర్శనం టికెట్లను టీటీడీ అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది.

కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో టికెట్లను కేటాయిస్తున్నట్టు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. దర్శన సమయంలో భక్తులు కచ్చితంగా మాస్కులు ధరించాలని కోరారు. https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్లో భక్తులు తమ దర్శనం టికెట్లు, గదులను బుక్ చేసుకోవచ్చు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement