'ఆర్ఆర్ఆర్' కోసం ఎన్టీఆర్ .. చరణ్ పై సాంగ్ షూట్!

22-06-2021 Tue 10:45
advertisement

కరోనా కారణంగా వాయిదాపడిన 'ఆర్ ఆర్ ఆర్' షూటింగు మళ్లీ మొదలైంది. చాలా రోజుల తరువాత చరణ్ సెట్స్ పైకి వచ్చాడు. ఆయనకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ రోజునగానీ .. ఈ వారంలోగాని ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగులో జాయిన్ కానున్నాడని అంటున్నారు. ఎన్టీఆర్ - చరణ్ కాంబినేషన్లో ఒక పాటను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారట. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతూనే ఉన్నాయి. ఇద్దరి కాంబినేషన్లో రూపొందే ఈ పాట .. పోరాటపటిమను పెంచేదిగా ఉంటుందని అంటున్నారు.ఎన్టీఆర్ -  చరణ్ పై సాగే ఈ పాటను రాజమౌళి చిత్రీకరించే విధానం, ఆడియన్స్ ను మంత్రముగ్ధులను చేస్తుందని అంటున్నారు. ఈ సినిమాకి ఈ పాట హైలైట్ గా నిలవడం ఖాయమని చెబుతున్నారు. అజయ్ దేవగణ్ .. అలియాభట్ వంటి ఇతరభాషా నటీనటులు ఈ సినిమాలో చాలామందే ఉన్నారు. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా, సంచలనానికి తెర తీయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement