మోదీతో అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం అందింది: ఒమర్ అబ్దుల్లా

19-06-2021 Sat 21:23
advertisement

వచ్చే గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న అఖిలపక్ష సమావేశానికి తనకు ఆహ్వానం అందిందని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు. జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదాను మళ్లీ ఇవ్వబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. దీంతోపాటు పలు ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఈనెల 24న అఖిలపక్ష సమావేశం జరగనుందని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.

మరోవైపు జమ్మూ కశ్మీర్ మరో మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ, అఖిలపక్ష సమావేశంపై చర్చించేందుకు తమ పార్టీ నేతలతో రేపు సమావేశమవున్నట్టు తెలిపారు. అఖిలపక్ష సమావేశానికి సంబంధించి తనకు ఫోన్ వచ్చిందని చెప్పారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాలతో పాటు టాప్ లెవెల్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ అధికారులు భేటీ అయ్యారు.

2019 ఆగస్ట్ లో జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం విభజించిన సంగతి తెలిసిందే.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement