జగన్ అక్రమాస్తుల కేసు.. విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

17-06-2021 Thu 07:48
advertisement

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి నిన్న సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. రాంకీ కేసులో ఎ-2 నిందితుడైన విజయసాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌లో వాదనలు ముగిశాయి. ఈ సందర్భంగా విజయసాయి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ కేసులో విజయసాయిని అక్రమంగా ఇరికించారని ఆరోపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఇదే కేసులో ఇతర డిశ్చార్జ్ పిటిషన్లతోపాటు జగతిలో పెట్టుబడులు, వాన్‌పిక్ కేసులపై ఇతర విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. అలాగే, ఎమ్మార్ వ్యవహారంపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement