సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
17-06-2021 Thu 07:26
- 'ఆర్ఆర్ఆర్' కోసం వస్తున్న అలియా
- రెడీ అవుతున్న 'నారప్ప' తొలి కాపీ
- చిత్తూరు యాసలో రవితేజ డైలాగులు

* ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం షూటింగ్ కోసం బాలీవుడ్ నటి అలియా భట్ జులై మొదటి వారం నుంచి డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో ఆమె చరణ్ సరసన కథానాయికగా నటిస్తోంది.
* ప్రముఖ నటుడు వెంకటేశ్ కథానాయకుడుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న 'నారప్ప' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. మరో వారంలో సినిమా ఫస్ట్ కాపీ వస్తుందని తెలుస్తోంది. థియేటర్లను ఓపెన్ చేయడాన్ని బట్టి రిలీజ్ డేట్ ను నిర్ణయిస్తారు.
* ప్రస్తుతం చేస్తున్న 'ఖిలాడి' సినిమా తర్వాత రవితేజ తన తదుపరి చిత్రాన్ని శరత్ మండవ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇందులో ఆయన చిత్తూరు యాసలో మాట్లాడతారని, పాత్ర ఫుల్ కామెడీగా ఉంటుందని అంటున్నారు.
ADVERTSIEMENT
More Telugu News
ఐదు భాషల్లో ఎన్టీఆర్ 30వ చిత్రం... కొరటాల శివ దర్శకత్వం... రౌద్రం ఉట్టిపడేలా స్పెషల్ వీడియో
1 hour ago

తాడేపల్లి చేరిన గన్నవరం వైసీపీ పంచాయితీ
2 hours ago

'అఖండ' సీక్వెల్ కథపై జరుగుతున్న కసరత్తు!
2 hours ago
