సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

14-06-2021 Mon 07:29
advertisement

*  మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను సడలించి, అనుమతులు ఇవ్వడంతో ముంబైలో తిరిగి షూటింగులు మొదలవుతున్నాయి. ఈ క్రమంలో కథానాయిక రష్మిక కూడా 'గుడ్ బై' హిందీ చిత్రం షూటింగులో పాల్గొనడానికి నిన్న ముంబై చేరుకుంది. ఈ చిత్రంలో అమితాబ్, రష్మిక తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారు.
*  నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ తదుపరి షెడ్యూలు షూటింగ్ వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభమవుతుంది. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.
*  తెలుగులో హిట్టయిన 'ఛత్రపతి' చిత్రాన్ని హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేస్తున్న విషయం విదితమే. వీవీ వినాయక్ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగును వచ్చే నెల 10 నుంచి హైదరాబాదులో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం నగర శివారులో ఓ భారీ విలేజ్ సెట్ ను వేస్తున్నారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement