ఉదయం 11 గంటలకు బీజేపీలోకి ఈటల.. సర్వం సిద్ధం!
14-06-2021 Mon 07:11
- ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ఈటల
- బీజేపీ చీఫ్ నడ్డాతో సమావేశం
- రేపు తిరిగి హైదరాబాద్కు

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉదయం 11 గంటలకు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రాజేందర్ సహా ఇతర నేతలు కాషాయ కండువా కప్పుకుంటారు. అనంతరం అందరూ కలిసి బీజేపీ చీఫ్ నడ్డాతో సమావేశం అవుతారు.
కాగా, తనతో కలిసి వస్తున్న నేతలతోపాటు బీజేపీ నాయకులను ఢిల్లీ తీసుకెళ్లేందుకు ఈటల రాజేందర్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. పార్టీలో చేరిన అనంతరం రేపు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. పార్టీలో చేరిక కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు పాల్గొంటారు.
More Latest News
‘లాల్ సింగ్ చడ్డా’ను గుర్తించిన ఆస్కార్
37 minutes ago

మరోమారు కరోనా బారిన పడ్డ సోనియా గాంధీ
1 hour ago

73 బంతుల్లో శతక్కొట్టిన పుజారా.. ఎక్కడంటే..!
2 hours ago

కృతి శెట్టికి టెన్షన్ మొదలైనట్టే!
2 hours ago

ఇక మాస్కులు ధరించక్కర్లేదంటున్న ఉత్తర కొరియా
3 hours ago

భారీ ఫ్లాప్ తప్పించుకున్న విజయ్ సేతుపతి
3 hours ago
