ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం!

12-06-2021 Sat 13:58
advertisement

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. లజపతి నగర్ సెంట్రల్ మార్కెట్ లోని షోరూంలలో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. బాట్లా హ్యాండ్లూమ్, సంగమ్ శారీ, రేమండ్ రీటెయిల్ వంటి షోరూంలూ మంటల్లో చిక్కుకున్నాయి. మంటలను ఆర్పేందుకు 30 ఫైరింజన్లు ఘటనా స్థలానికి వచ్చాయి.

70 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు అని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధిపతి అతుల్ గార్గ్ చెప్పారు. దానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం సిబ్బంది వెతుకుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగినట్టు ఉదయం 10.20 గంటలకు ఫోన్ వచ్చిందని అధికారులు తెలిపారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement