శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.. సీజేఐగా తొలిసారి నేడు హైదరాబాదుకు!

11-06-2021 Fri 09:58
advertisement

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ రమణ ఈరోజు ఉద‌యం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. అంత‌కు ముందు జ‌స్టిస్ రమణ దంపతులకు ఆలయ మహాద్వారం వద్ద అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఇత‌ర అధికారులు వారికి స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం జ‌స్టిస్‌ రమణ దంపతులు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. కాగా, జస్టిస్‌ రమణ దంప‌తులు నిన్న రాత్రే తిరుమల చేరుకున్నారు. శ్రీవారి ఏకాంత సేవలోనూ పాల్గొన్నారు.
 
ఈ రోజు మ‌ధ్యాహ్నం జ‌స్టిస్ ర‌మ‌ణ  హైదరాబాద్‌కు రానున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం ఆయన తొలిసారి రాష్ట్రానికి వ‌స్తుండ‌డంతో ఆయ‌న‌కు ఘ‌న‌ స్వాగ‌తం ప‌లికేందుకు తెలంగాణ స‌ర్కారు ఏర్పాట్లు చేసింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో జస్టిస్ రమణకు మంత్రి కేటీఆర్ స్వాగతం పలకనున్నారు. మూడు రోజుల పాటు రాజ్‌భవన్ అతిథి గృహంలో జస్టిస్‌ రమణ బస చేస్తారు. ప్ర‌జ‌ల నుంచి విజ్ఞ‌ప్తులూ స్వీక‌రించే అవ‌కాశం ఉంది.


Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement