'థ్యాంక్యూ' సినిమా నుంచి రానున్న ఫస్టులుక్!

10-06-2021 Thu 17:29
advertisement

నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా రూపొందుతోంది. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇంకా కొన్ని రోజులపాటు చిత్రీకరణను జరిపితే ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫస్టులుక్ రానున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల చివరివారంలోగానీ .. వచ్చేనెల మొదటివారంలో గాని ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారని అంటున్నారు.

నాగచైతన్య హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా రాశి ఖన్నా కనువిందు చేయనుంది. ఇక మాళవిక నాయర్ .. అవికా గోర్ కూడా కథానాయికలుగానే కనిపించనున్నారు. అంటే ఈ సినిమాలో చైతూ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నారన్న మాట.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి సెలవుల్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ లోగా చైతూ హీరోగా చేసిన 'లవ్ స్టోరీ' ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement