ప్రగతి భవన్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం... అడ్డుకున్న పోలీసులు

08-06-2021 Tue 15:26
advertisement

హైదరాబాద్ ప్రగతి భవన్ వద్ద క్యాబినెట్ సమావేశం ప్రారంభం కావడానికి కొద్ది ముందుగా ఇద్దరు అన్నదమ్ములు కలకలం రేపారు. వారిలో ఓ వ్యక్తి ప్రగతి భవన్ ఎదుట శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు సకాలంలో అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఆ వ్యక్తి సోదరుడు మంత్రుల కాన్వాయ్ కి అడ్డంగా వెళ్లేందుకు యత్నించాడు. ఈ సోదరులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిది కొంపల్లి అని గుర్తించారు.

కాగా, ఓ సివిల్ వివాదంలో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని, అందుకే ప్రగతి భవన్ ఎదుట ఆందోళనకు యత్నించామని ఆ అన్నదమ్ములు వెల్లడించారు. ఫిర్యాదు చేసిన తమనే పోలీసులు వేధిస్తున్నారని వారు ఆరోపించారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement