ఆగస్టు నుంచి పట్టాలపైకి హరీశ్ శంకర్ సినిమా!

07-06-2021 Mon 10:36
advertisement

పవన్ కల్యాణ్ .. హరీశ్ శంకర్ కాంబినేషన్లో 'గబ్బర్ సింగ్' తరువాత మరో సినిమా రాలేదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఆ తరహా సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్టును సెట్ చేసుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ప్రస్తుతం  అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఆగస్టు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందనేది తాజా సమాచారం.

ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా పవన్ రెండు పాత్రల్లో కనిపించనున్నారని అంటున్నారు. తండ్రి పాత్రలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగు కోసం పవన్ నెలకి 10 రోజులు కేటాయించారని అంటున్నారు. అంటే ఒక వైపున 'హరహర మహాదేవ' .. మరో వైపున 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ లో చేస్తూనే, ఈ సినిమా షూటింగులోను పవన్ పాల్గొననున్నారన్న మాట. ఇక ఈ సినిమాలో కథానాయికలుగా అవకాశం ఎవరిని వరిస్తుందో చూడాలి.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement