వీవీ ప్యాట్ ల కచ్చితత్వం, ప్రామాణికత మరోసారి రుజువైంది: ఈసీ

03-06-2021 Thu 18:30
advertisement

ఓటు హక్కు వినియోగించుకోగానే రసీదు అందించే వీవీ ప్యాట్ యంత్రాలను కేంద్ర ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. ఇటీవల పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వీవీ ప్యాట్లను వినియోగించగా, వాటి పనితీరుపై ఈసీ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. వీవీ ప్యాట్ ల కచ్చితత్వం, ప్రామాణికత మరోసారి రుజువైందని ఈసీ వెల్లడించింది.

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారీగా వీవీ ప్యాట్ లను వినియోగించినట్టు తెలిపింది. పశ్చిమ బెంగాల్ లో 1492, తమిళనాడులో 1183, అసోంలో 647, పుదుచ్చేరిలో 156, కేరళలో 728 వీవీ ప్యాట్లు వినియోగించినట్టు ఈసీ పేర్కొంది. ప్రతి నియోజకవర్గంలో 5 వీవీ ప్యాట్ ల లోని స్లిప్పులు లెక్కించగా... ఈవీఎంలు, వీవీ ప్యాట్ లు 100 శాతం సరిపోలాయని వెల్లడించింది.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement