ఆనందయ్య ఔషధం పంపిణీకి ఏపీ హైకోర్టు అనుమతి
31-05-2021 Mon 16:07
- ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
- ఆనందయ్య మందుపై నేడు హైకోర్టులో విచారణ
- చుక్కల మందుపై గురువారం లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశం
- తదుపరి విచారణ గురువారానికి వాయిదా

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ఔషధం పంపిణీకి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, ఏపీ హైకోర్టు కూడా ఆనందయ్య మందుకు అనుమతి ఇచ్చింది. ఆనందయ్య ఔషధం పంపిణీపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది.
మధ్యాహ్నం 1 గంట సమయానికి వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మధ్యాహ్నం 3 గంటల సమయానికి వాయిదా వేసింది. కోర్టులో విచారణ పునఃప్రారంభమైన అనంతరం, ఆనందయ్య మందును పంపిణీ చేయవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, కంట్లో వేసే చుక్కల మందుపై గురువారం లోగా పూర్తి నివేదిక అందజేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
More Latest News
మూవీ రివ్యూ: 'కార్తికేయ 2'
3 hours ago

తెలంగాణలో తాజాగా 440 మందికి కరోనా పాజిటివ్
4 hours ago

వరల్డ్ చాంపియన్ షిప్‌కు పీవీ సింధు దూరం... కారణం చెబుతూ భావోద్వేగానికి గురైన స్టార్ షట్లర్
4 hours ago

విజయనగరం జిల్లాలో పాత ఇల్లు కూల్చుతుండగా బయటపడిన లాకర్... మాదంటే మాదని యజమాని, కూలీల మధ్య వివాదం
5 hours ago
