ఆనందయ్య మందును తొలుత జంతువులపై ప్రయోగించాలనుకుంటున్న శాస్త్రవేత్తలు
26-05-2021 Wed 15:31
- అనుమతి వస్తే ప్రయోగాలు చేపడతామన్న సృజన లైఫ్ ల్యాబ్
- కుందేళ్లు, ఎలుకలపై ప్రయోగాలు జరుపుతామని వెల్లడి
- జంతువులపై కంటి మందు ప్రయోగం చేయాల్సిన అవసరం ఉంది

నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య నాటు మందుకు అనుమతులు లభిస్తాయా? లేదా? అనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈ మందులు జంతువులపై ప్రయోగించాలని సృజన లైఫ్ ల్యాబ్ కు చెందిన శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ మందుపై అనుమతి వస్తే ప్రయోగాలను చేపడతామని తెలిపారు.
కుందేళ్లు, ఎలుకలపై ప్రయోగాలు చేస్తామని... విడతల వారీగా వాటికి మందు ఇచ్చి పరీక్షిస్తామని చెప్పారు. గత 15 ఏళ్లుగా పలు మందుల విషయంలో తమ ల్యాబ్ లో జంతువులపై ప్రయోగాలు చేస్తున్నామని తెలిపారు. కరోనా వైరస్ అధికంగా ఉన్న జంతువులపై కంటి మందు ప్రయోగం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే ఒక జంతువుకు కరోనా వైరస్ ను సోకించి పరీక్ష చేసే వ్యవస్థ మాత్రం తమ దగ్గర లేదని తెలిపారు.
More Latest News
తెలంగాణలో తాజాగా 435 మందికి కరోనా పాజిటివ్
2 hours ago

బాయ్ కాట్ ట్రెండ్ పై అర్జున్ కపూర్ వ్యాఖ్యలు... నీ పని నువ్వు చూస్కో అంటూ మధ్యప్రదేశ్ మంత్రి కౌంటర్
2 hours ago

టాలీవుడ్ వాళ్లు షూటింగులు ఆపేసి ఏం చేస్తున్నారని బాలీవుడ్ వాళ్లు ఆరా తీస్తున్నారు: దిల్ రాజు
4 hours ago
