భారత్‌లోని కొత్త ర‌కం కరోనా వేరియంట్ల‌పై స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తోన్న ఫైజర్‌, మోడెర్నా టీకాలు

18-05-2021 Tue 12:35
pfizer moderna effective against new covid variants

భారత్‌లో విజృంభిస్తోన్న కొత్తరకం కరోనా వేరియంట్  బి.1.617తో పాటు బి.1.618 వేరియంట్ పై కూడా అమెరికా వ్యాక్సిన్లు ఫైజర్‌, మోడెర్నా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ప‌రిశోధ‌కులు తెలిపారు. అమెరికాలో ఈ రెండు వ్యాక్సిన్లను తీసుకున్నవారి నుంచి  నమూనాలను సేకరించామ‌ని, వాటిని భారత్‌లో వెలుగుచూసిన బి.1.617, బి.1.618 వేరియంట్లతో కలిపి ల్యాబ్ లో పరీక్షించినట్లు అమెరికాకు చెందిన ఎన్‌వైయూ గ్రాస్‌మాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌, లాంగోన్‌ సెంటర్‌కు చెందిన పరిశోధకులు తెలిపారు.

ఫైజర్‌, మోడెర్నా టీకాలు రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు 3-4 రెట్ల‌ అధికంగా ప్రభావవంతంగా ప‌నిచేస్తున్నాయ‌ని గుర్తించినట్లు చెప్పారు. అధిక శాతం ప్ర‌తిర‌క్ష‌కాలు ఈ వేరియంట్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.

శ‌రీరంలోని ఏసీఈ2 కణాలు కరోనా గ్రాహకాలుగా మారుతున్నాయని, ఈ కారణంగానే కరోనా వ్యాపించే తీరులో అనేక మార్పులొస్తున్నట్లు వారు చెప్పారు. అయితే, ఆయా వేరియంట్లను వ్యాక్సిన్లు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయ‌ని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా వీలైనంత త్వరగా వ్యాక్సిన్ల‌ను వేయడం ద్వారా క‌రోనాను నియంత్రించ‌వ‌చ్చ‌ని చెప్పారు.


More Telugu News
Allu Arjun attends Varudu Kavalenu pre release event
Telangana covid media report
Agni five missile test fire successful
Namibia bowlers shaken Scotland batting lineup
Sajjala comments on Chandrababu
Union govt announces prestigious sports awards
Harish Rao slams BJP ahead of Huzurabad by polls
Vijayasai Reddy alleges a Telangana Police Official colluded with Chandrababu
Para Military forces deployed in Badvel constituency
England beat Bangladesh with the the help of Jason Roy lightening innings
Romantic song video released
Pooja Hegde busy in construction works of her dream home in Mumbai
Chandrababu cheated Kuppam people says Mithun Reddy
Annatthe Trailer released
Balakrishna shares Aha Unstoppable talk show promo
..more