'సలార్'లో ఆర్మీ ఆఫీసర్ గా ప్రభాస్!

15-05-2021 Sat 18:26
advertisement

ప్రస్తుతం ప్రభాస్ 'సలార్' సినిమా చేస్తున్నాడు .. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా ఇది నిర్మితమవుతోంది. ఈ సినిమా నుంచి వస్తున్న పోస్టర్స్ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని తెలిసిన దగ్గర నుంచి అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. తండ్రీకొడుకులుగా ప్రభాస్ కనిపించనున్నాడని అంటున్నారు. ఈ రెండు విభిన్నమైన లుక్స్ లో ప్రభాస్ ను చూడటానికి వాళ్లంతా ఆత్రుత పడుతున్నారు.

ప్రభాస్ తండ్రి పాత్రకి సంబంధించిన ఎపిసోడ్ ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందట. ఈ ఎపిసోడ్ లోనే ఆయన ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ పాత్రను ప్రశాంత్ నీల్ డిజైన్ చేసిన తీరు ఆశ్చర్యచకితులను చేస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ లో వచ్చే 'వార్' సీన్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ప్రభాస్ అభిమానులు విజిల్స్ వేసేలా ఈ ఎపిసోడ్ సాగుతుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా శ్రుతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement