తూర్పుగోదావరి జిల్లాలో లారీ బీభత్సం.. ఇద్దరు పోలీసుల మృతి

14-05-2021 Fri 10:10
advertisement

తూర్పుగోదావరి జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ ఇద్దరు పోలీసుల ప్రాణాలను బలిగొంది. సామర్లకోట మండలం ఉండూరు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, విజయవాడ నుంచి కరోనా వ్యాక్సిన్ తో వస్తున్న వాహనానికి ఎస్కార్టుగా వెళ్లేందుకు హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, హోమ్ గార్డు ఎన్ఎస్ రెడ్డి ఈ వేకువజామున ఉండూరు వంతెన వద్ద వేచిస్తున్నారు. ఇదే సమయంలో వేగంగా వచ్చిన లారీ వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో పోలీసు వాహనం కూడా డ్యామేజ్ అయింది.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement