కృతిశెట్టి ఆ స్టార్ డైరెక్టర్ కి నో చెప్పిందట!

12-05-2021 Wed 13:08

advertisement

 'ఉప్పెన' సినిమాతో కృతి శెట్టి స్టార్ డమ్ అందుకుంది. యంగ్ హీరోయిన్స్ లో ఇప్పుడు ఈ అమ్మాయికి ఉన్నంత క్రేజ్ అంతాఇంతా కాదు. అసలు 'ఉప్పెన' సినిమా సెట్స్ పై ఉండగానే నాని సినిమాలోనూ .. సుధీర్ బాబు మూవీలోను కృతి ఛాన్స్ కొట్టేసింది. రామ్- లింగుస్వామి ప్రాజెక్టులోను అడుగుపెట్టేసింది. ఇక నితిన్ ..  చైతూ .. నిఖిల్ ..  నాగశౌర్య వంటి హీరోలు లైన్లో ఉండనే ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే ఒక వార్త జోరుగా షికారు చేస్తోంది. దగ్గుబాటి అభిరామ్ హీరోగా తేజ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అభిరామ్ ఈ సినిమాతోనే హీరోగా తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కృతి శెట్టిని అడిగారట. అయితే డేట్స్ ఖాళీగా లేవని చెప్పి, తేజ ఆఫర్ ను ఈ అమ్మాయి సున్నితంగా తిరస్కరించిందని అంటున్నారు. అభిరామ్ జోడిగా ఎవరు కనువిందు చేస్తారో చూడాలి మరి.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement