'పార్థు' అనే పేరు అంటే త్రివిక్రమ్ కి అంత ఇష్టమట!

07-05-2021 Fri 12:38
advertisement

త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా .. దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఒక కథలో ఏయే అంశాలు ఏ పాళ్లలో ఉండాలనేది ఆయనకి బాగా తెలుసు. అందువల్లనే అన్నివర్గాల ప్రేక్షకులను అలరించగలుగుతున్నాడు. అలాంటి త్రివిక్రమ్ తన తాజా చిత్రాన్ని మహేశ్ బాబుతో ప్లాన్ చేసుకున్నాడు. ఈ సినిమాకి 'పార్థు' అనే టైటిల్ ను సెట్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 'అతడు' సినిమాలో మహేశ్ బాబు పాత్ర పేరు 'పార్థు'. అందువలన ఆ పాత్ర పేరునే ఆయన ఈ సారి టైటిల్ గా పెడుతున్నాడని అనుకున్నారు.

అయితే 'అతడు' సినిమాకి ముందునుంచే 'పార్థు' అనే పేరు అంటే త్రివిక్రమ్ కి ఇష్టమట. అందుకు కారణం 'యద్దనపూడి సులోచనారాణి' నవలలు అంటే త్రివిక్రమ్ కి చాలా ఇష్టం .. ఆ నవలల్లో 'పార్థు' అనే నవల అంటే ఆయనకి మరింత ఇష్టమట. అందువల్లనే ఆయన 'అతడు' సినిమాలో మహేశ్ బాబు పాత్రకి ఆ పేరును పెట్టాడట. ఇక ఆ తరువాత ఎప్పటికైనా 'పార్థు' టైటిల్ తో ఓ సినిమా చేయాలని ఆయన చాలా కాలం క్రితమే నిర్ణయించుకున్నాడట. అది ఇప్పటికి .. ఇలా కుదిరింది. ఈ లోగా ఎంతమంది దర్శక నిర్మాతలు ఆ టైటిల్ ను అడిగినా త్రివిక్రమ్ ఇవ్వలేదట. ఆయనకి ఆ పేరు అంటే అంత ఇష్టమన్న మాట!

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement