'అఖండ' వచ్చేది అప్పుడేనట!

07-05-2021 Fri 11:31
advertisement

బాలకృష్ణ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో 'అఖండ' రూపొందుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో బాలకృష్ణ రైతు గానూ .. అఘోరగాను కనిపించనున్నారు. ఏ పాత్ర నుంచి ఆయన ఏ పాత్ర వైపుకు వెళతారనేది ఆసక్తికరంగా మారింది.

గతంలో బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో రెండు బ్లాక్ బస్టర్లు పడటం వలన, సహజంగానే ఈ సినిమాపైన అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన టీజర్, రికార్డుస్థాయిలో వ్యూస్ ను రాబట్టుకుంది.

నిజానికి ఈ సినిమాను ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని ఈ నెల 28వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగుకు అంతరాయం కలగడం వలన ఆలస్యమవుతూ వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టుగా దర్శక నిర్మాతలు ప్రకటించలేదుగానీ, సెప్టెంబర్ లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ విషయంపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారనేది చూడాలి. బాలకృష్ణ  సరసన నాయికగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా, మరో నాయికగా పూర్ణ కనిపించనుంది.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement