సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
06-05-2021 Thu 07:27
- నిధి అగర్వాల్ కు మరో బిగ్ ఆఫర్
- మరో రీమేక్ సినిమాలో వెంకటేశ్
- ఓటీటీ షోకి ఓకే చెప్పిన ఇలియానా

* ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన 'హరహర మహాదేవ' సినిమాలో నటిస్తున్న కథానాయిక నిధి అగర్వాల్ కు త్వరలో మహేశ్ బాబు సరసన నటించే ఛాన్స్ కూడా వస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా రూపొందే సినిమా కోసం నిధి అగర్వాల్ ను సంప్రదిస్తున్నట్టు తాజా సమాచారం.
* ప్రస్తుతం 'దృశ్యం 2' మలయాళ రీమేక్ లో నటిస్తున్న ప్రముఖ నటుడు వెంకటేశ్ తాజాగా మరో రీమేక్ సినిమాలో నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి. మలయాళంలో వచ్చిన 'డ్రైవింగ్ లైసెన్స్' చిత్రం రీమేక్ ప్రాజక్టు ప్రస్తుతం వెంకటేశ్ వద్దకు వచ్చినట్టు, చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.
* ఒకప్పుడు దక్షిణాదిన బిజీ కథానాయికగా రాణించిన ఇలియానా.. ప్రస్తుతం హిందీలో ఒకటీ అరా సినిమాలలో మాత్రమే నటిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓటీటీ షోకి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ షోను నిర్మించనుంది.
ADVERTSIEMENT
More Telugu News
ఎన్టీఆర్ కథపై బుచ్చిబాబు కసరత్తు కంప్లీట్ కాలేదట!
4 minutes ago

మీది షరతుల్లేని ప్రేమ... ఎప్పటికీ మీకు రుణపడి ఉంటా: ఎన్టీఆర్
47 minutes ago

కోలీవుడ్ యంగ్ హీరో జోడీగా సాయిపల్లవి!
1 hour ago
