లోకేశ్ ప్రసన్నం కోసం అచ్చెన్న మరీ దిగజారి డప్పు వాయిస్తున్నాడు: విజ‌య‌సాయిరెడ్డి

05-05-2021 Wed 12:13
advertisement

టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. టీడీపీ నేత‌ లోకేశ్ పై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని, దీంతో ఇప్పుడు ఆ విష‌యంపై భ‌య‌ప‌డుతున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.  

'లోకేశ్  ప్రసన్నం కోసం అచ్చెన్న మరీ దిగజారి డప్పు వాయిస్తున్నాడు. అగౌరవంగా  "వాడు సరిగా ఉంటే పార్టీకి ఈ గతి ఎందుకు పడుతుంది" అనడాన్ని చిట్టి నాయుడు సీరియస్ గా తీసుకుంటాడేమో అని టెన్షన్ పడుతున్నట్టుంది. పార్టీ ఉండదూ, బొక్కా ఉండదని ఉన్నమాటే అన్నావ్. ఆ మాటకే కట్టుబడి ఉండు అచ్చెన్నా' అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.  

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement