'శాకినీ .. ఢాకిని'గా రెజీనా, నివేదా!

04-05-2021 Tue 18:08

advertisement

ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై రీమేక్ ల జోరు పెరుగుతోంది. చాలావరకూ సెట్స్ పై ఉన్న సినిమాలు ఏదో ఒక రీమేక్ అనే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 'శాకినీ .. ఢాకిని' సినిమా కూడా 'మిడ్ నైట్ రన్నర్స్' అనే ఒక కొరియన్ సినిమాకి రీమేక్ అని తెలుస్తోంది. సురేశ్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమా రీమేక్ హక్కులు తీసుకుని రూపొందిస్తున్నారు. సుధీర్ వర్మ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. శాకినీగా రెజీనా ... ఢాకినిగా నివేద థామస్ నటిస్తున్నారు. విభిన్నమైన కథాకథనాలతో నడిచే ఈ సినిమాకి మరో నిర్మాతగా సునీత తాటి వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాలో రెజీనా .. నివేద ఇద్దరూ కూడా ట్రైనీ పోలీసులుగా కనిపిస్తారట. అలాంటి వీరిద్దరూ ఓ అమ్మాయి కిడ్నాప్ కేసును ఛేదించవలసి వస్తుంది. అప్పుడు వాళ్లు ఏం చేశారు? పర్యవసానాలు ఎలాంటివి? అనే ఆసక్తికరమైన అంశం  చుట్టూ ఈ కథ తిరుగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో రెజీనా .. నివేదా ఫైటింగులు కూడా చేసేస్తారట. ఆల్రెడీ ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకుందట. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ కారణంగా వాయిదాపడిన ఈ సినిమా, త్వరలోనే మళ్లీ సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement