తిరుమలలో అగ్నిప్రమాదం... ఒకరి సజీవదహనం

04-05-2021 Tue 12:05
advertisement

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకరు సజీవదహనం అయ్యారు. తిరుమలలోని ఆస్థాన మండపం సమీపంలోని దుకాణాల్లో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి 8 దుకాణాలు దగ్ధం అయ్యాయి. షాపు నెం.84 నుంచి శకలాలు తొలగిస్తుండగా ఓ మృతదేహం బయటపడింది. అతడిని దుకాణదారుడిగా గుర్తించారు. అగ్నిమాపక బృందాలు ఘటన స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనలో తిరుమల వ్యాపార వర్గాల్లో విషాదం నెలకొంది.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement