నేటి కోల్‌క‌తా- బెంగ‌ళూరు మ్యాచ్ వాయిదా

03-05-2021 Mon 13:09
advertisement

ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వాయిదా పడింది. క‌రోనా క‌ల‌క‌ల‌మే ఇందుకు కార‌ణం. కోల్‌కతా టీమ్‌లో వరుణ్‌ చక్రవర్తితో పాటు సందీప్‌ వారియర్‌కు కరోనా వైరస్‌ సోకడంతో ఈ మ్యాచ్‌ను వాయిదా వేసిన‌ట్లు తెలిసింది.  అహ్మదాబాద్ మైదానంలో జ‌ర‌గాల్సిన ఈ మ్యాచు రీషెడ్యూలు తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

కోల్‌క‌తా ఆట‌గాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్‌ వారియర్ ఇటీవ‌ల‌ గాయపడగా, వారిని స్కానింగ్‌ కోసం ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అయితే, ఈ సంద‌ర్భంగా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయినట్లు స‌మాచారం.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement