'టక్ జగదీశ్' టీజర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది!

26-04-2021 Mon 17:15

advertisement

నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీశ్' సినిమా రూపొందింది. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఈ సినిమాను నిర్మించారు. నాని సరసన నాయికగా రీతూ వర్మ నటించగా, మరో ముఖ్యమైన పాత్రను ఐశ్వర్య రాజేశ్ పోషించింది. ఈ సినిమాలో నాని అన్నయ్య పాత్రలో జగపతిబాబు కనిపించనుండటం విశేషం. నాని పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఫిబ్రవరి 24వ తేదీకి ముందు రోజున ఈ సినిమా నుంచి ఒక టీజర్ వదిలారు.

'నిన్ను చూసి నికరంగా రొమ్ము ఇరుచుకున్నాది ..' అనే పాటపై టీజర్ ను కట్ చేశారు. ఈ టీజర్ ను యూ ట్యూబ్ లో వదిలిన వెంటనే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత కూడా అదే రేంజ్ లో ఈ టీజర్ దూసుకుపోయింది. అలా ఈ టీజర్ ఇంతవరకూ 11 మిలియన్ వ్యూస్ ను రాబట్టడం విశేషం. నిజానికి ఈ నెల 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కానీ కరోనా ఉధృతి కారణంగా వాయిదా పడింది. 'నిన్నుకోరి' తరువాత నాని - శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement