శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురి దుర్మరణం
18-04-2021 Sun 19:52
- కారును ఢీకొట్టి బోల్తాపడిన లారీ
- ప్రమాదం జరిగిన సమయంలో లారీలో 30 మంది
- ఒడిశాకు చెందినవారిగా గుర్తింపు
- 15 మందికి గాయాలు
- లారీ కింద చిక్కుకున్న ఆరుగురు కార్మికులు!

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారును ఢీకొట్టి లారీ బోల్తా పడిన ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. అటు, బోల్తా పడిన లారీ కింద ఆరుగురు కార్మికులు చిక్కుకున్నట్టు భావిస్తున్నారు. వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం బీభత్సంగా మారింది.
ప్రమాద సమయంలో లారీలో 30 మందికి పైగా కార్మికులు ఉన్నారు. వారంతా ఒడిశాకు చెందిన దినసరి కూలీలు అని గుర్తించారు. శంషాబాద్ లో కూరగాయల మార్కెట్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఘటన స్థలంలో పోలీసులు, అత్యవసర వైద్య సిబ్బంది సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు.
ADVERTSIEMENT
More Telugu News
ఎన్టీఆర్ కథపై బుచ్చిబాబు కసరత్తు పూర్తి కాలేదట!
13 minutes ago

మీది షరతుల్లేని ప్రేమ... ఎప్పటికీ మీకు రుణపడి ఉంటా: ఎన్టీఆర్
56 minutes ago

కోలీవుడ్ యంగ్ హీరో జోడీగా సాయిపల్లవి!
1 hour ago
