ఐపీఎల్: సన్ రైజర్స్ టార్గెట్ 151 రన్స్

17-04-2021 Sat 21:17
advertisement

ఐపీఎల్ 14వ సీజన్ లో భాగంగా చెన్నైలో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి ఆశించిన స్కోరును మాత్రం సాధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసింది. చివర్లో పొలార్డ్ (22 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులతో 35 నాటౌట్) కాస్త బ్యాట్ ఝుళిపించడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.

అంతకుముందు, ఓపెనర్లు క్వింటన్ డికాక్ 40, రోహిత్ శర్మ 32 పరుగులు చేశారు. సన్ రైజర్స్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, విజయ్ శంకర్ రెండేసి వికెట్లు తీశారు. ఖలీల్ అహ్మద్ కు ఓ వికెట్ దక్కింది.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement