కర్ణాటక సీఎం యడియూరప్పకు కరోనా
16-04-2021 Fri 14:34
- తీవ్ర జ్వరంలో ఆసుపత్రిలో చేరిక
- రెండ్రోజుల క్రితం టెస్ట్ చేస్తే నెగెటివ్
- రామయ్య ఆసుపత్రిలో చికిత్స
- ఈ రోజు ఉదయమే అధికారులతో కరోనాపై సమీక్ష

కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్. యడియూరప్ప కరోనా బారిన పడ్డారు. ఆయనకు తీవ్రమైన జ్వరం రావడంతో రెండ్రోజుల క్రితం కరోనా టెస్ట్ చేయగా.. నెగెటివ్ వచ్చింది. జ్వరం తీవ్రంగా ఉండడంతో శుక్రవారం బెంగళూరులోని రామయ్య మెమోరియల్ ఆసుపత్రిలో చేర్పించారు. మళ్లీ టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది.
దీంతో ఆయన్ను రామయ్య ఆసుపత్రి నుంచి మణిపాల్ ఆసుపత్రికి తరలిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. కాగా, అంతకుముందు ఈరోజు ఉదయం ఆయన కొవిడ్ పై అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. తన నివాసంలో అధికారులతో సమీక్ష చేశారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ADVERTSIEMENT
More Telugu News
వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ ను పార్టీ నుంచి, పెద్దల సభ నుంచి పంపించేసే వాళ్లు: పవన్ కల్యాణ్
18 minutes ago

వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
25 minutes ago

రేవంత్ రెడ్డి ఒక లుచ్చా: మంత్రి మల్లారెడ్డి
2 hours ago

ఒప్పో నుంచి నాజూకైన ట్యాబ్
2 hours ago
