సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

16-04-2021 Fri 07:23
advertisement

*  కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా తమిళ, తెలుగు భాషల్లో ఓ చిత్రం రూపొందుతోంది. దీనికి 'గోష్ఠి' అనే టైటిల్ని నిర్ణయించారు. ఎస్.కల్యాణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగును జనవరిలో ప్రారంభించి, వేగంగా చిత్రీకరణ జరిపి పూర్తిచేశారు. మీ నెలాఖరుకి దీనిని రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.     
*  కొంత కాలం గ్యాప్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలో తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. మహేశ్ బాబుతో త్రివిక్రమ్ చేసే సినిమా పూర్తయ్యాక ఇది సెట్స్ కి వెళుతుందని అంటున్నారు. ఈ లోగా పవన్ తన కమిట్ మెంట్స్ పూర్తిచేస్తారు.
*  ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందనుంది. కృతిశెట్టి హీరోయిన్ గా నటించే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement