ఈ సాయంత్రం ఢిల్లీలో సీఈసీ, హోం శాఖ కార్యదర్శిలను కలవనున్న టీడీపీ నేతలు
13-04-2021 Tue 15:27
- తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో ఉద్రిక్తతలు
- రాళ్ల దాడి అంశంపై టీడీపీ నేతల ఆగ్రహం
- ఢిల్లీ వరకు తీసుకెళ్లాలని నిర్ణయం
- ఈ సాయంత్రం కీలక భేటీలు

తిరుపతి రాళ్ల దాడి అంశాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్, కేంద్ర హోంశాఖ కార్యదర్శిలను కలవాలని టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ నిర్ణయించుకున్నారు. సాయంత్రం 4.15 గంటలకు సీఈసీతో భేటీ కానున్న టీడీపీ ఎంపీలు, సాయంత్రం 6 గంటలకు కేంద్రం హోంశాఖ కార్యదర్శితో సమావేశం కానున్నారు.
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగిందన్న విషయంపై ఫిర్యాదు చేయనున్నారు. కేంద్ర బలగాలతో తిరుపతి ఉప ఎన్నిక నిర్వహించాలని కోరనున్నారు. చంద్రబాబుకు రక్షణ కల్పించడంలో డీజీపీ విఫలం అయ్యాడని, పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు.
More Latest News
తండ్రి వయసున్న వ్యక్తిని పెళ్లాడాలని బలవంతం.. కాదన్నందుకు మెడిసిన్ విద్యార్థికి గుండు గీసి దురాగతం
6 minutes ago

పండంటి కవలలకు జన్మనిచ్చిన సినీ నటి నమిత
40 minutes ago

విజ్ఞానం, సాంకేతికత ఎంతో ప్రగతి సాధించాయి.. శృంగారానికి పురుషుడితో పనిలేదు: టీవీ నటి కనిష్కా సోని
1 hour ago
