కరోనా మహమ్మారి బారినపడిన తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి
13-04-2021 Tue 14:58
- తెలంగాణ వ్యవసాయశాఖలో కరోనా కలకలం
- ఇటీవలే ముఖ్య కార్యదర్శికి పాజిటివ్
- కమిషనరేట్ లోనూ పలువురు సిబ్బందికి కరోనా
- స్వల్పంగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్న మంత్రి
- హోం క్వారంటైన్ లో చికిత్స

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కరోనా బాధితుల జాబితాలో చేరారు. ఆయనకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని వెల్లడైంది. నిరంజన్ రెడ్డి గత రెండ్రోజులుగా స్వల్పంగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన మినిస్టర్స్ క్వార్టర్స్ లోని తన నివాసంలో హోం క్వారంటైన్ లో ఉన్నారు.
ఇటీవలే తెలంగాణ వ్యవసాయ శాఖలో కరోనా కలకలం రేగింది. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డితో వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయ సిబ్బంది కూడా కరోనా బారినపడ్డారు. మార్క్ ఫెడ్, ఆయిల్ ఫెడ్ విభాగాల్లోనూ పలువురికి కరోనా సోకినట్టు గుర్తించారు. వారిని కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖలో మరిన్ని కేసులు వెలుగు చూస్తాయని భావిస్తున్నారు.
More Latest News
ఇది వినడానికే సిగ్గుగా ఉంది: విజయశాంతి
2 hours ago

తెలంగాణలో తాజాగా 477 కరోనా పాజిటివ్ కేసులు
3 hours ago
