విరుచుకుపడిన దీపక్ హుడా, కేఎల్ రాహుల్... పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు

12-04-2021 Mon 21:53
advertisement

ముంబయి వాంఖెడే స్టేడియంలో మరోసారి పరుగులు వెల్లువెత్తాయి. రాజస్థాన్ రాయల్స్ తో ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు ఆకాశమే హద్దు అన్నట్టుగా చెలరేగిపోయారు. టాస్ ఓడిన పంజాబ్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 6 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి విధ్వంస ఇన్నింగ్స్ తో ఆకట్టుకోగా, మిడిలార్డర్ లో వచ్చిన దీపక్ హుడా మెరుపుదాడి చేశాడు.

ఓపెనర్ గా బరిలో దిగిన రాహుల్ 50 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులతో 91 పరుగులు సాధించాడు. దీపక్ హుడా కేవలం 28 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 భారీ సిక్సులతో 64 పరుగులు నమోదు చేశాడు. వన్ డౌన్ లో వచ్చిన క్రిస్ గేల్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 40 పరుగులు సాధించాడు. రాజస్థాన్ బౌలర్లలో చేతన్ సకారియా 3, క్రిస్ మోరిస్ 2 వికెట్లు తీశారు. రియాన్ పరాగ్ కు ఓ వికెట్ దక్కింది. పంజాబ్ బ్యాట్స్ మెన్ విజృంభణకు అడ్డుకట్ట వేసేందుకు ఈ మ్యాచ్ లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ఏకంగా 8 మందితో బౌలింగ్ చేయించాడు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement