హైదరాబాద్లో హోం క్వారంటైన్లోకి పవన్ కల్యాణ్
11-04-2021 Sun 13:26
- త్వరలోనే తిరుపతి ఉప ఎన్నిక
- పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్
- ప్రస్తుతం వర్చువల్ పద్ధతిలోనే పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తోన్న పవన్

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్లోని తన నివాసంలో హోం క్వారంటైన్లో ఉంటున్నారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం వర్చువల్ పద్ధతిలోనే జనసేన పార్టీ కార్యకలాపాలను పవన్ కల్యాణ్ పర్యవేక్షిస్తున్నారు.
త్వరలోనే తిరుపతి ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఆ స్థానంలో పోటీకి బీజేపీ-జనసేన తరఫున అభ్యర్థిగా రత్నప్రభ పోటీ చేస్తున్నారు. ఎన్నికలకు ముందే పవన్ కల్యాణ్ సిబ్బందిలో కొందరు కరోనా బారిన పడడంతో పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటనపై సందిగ్ధత నెలకొంది. ఆయన కరోనా పరీక్షలు చేయించుకుని నెగటివ్ అని తేలితే మళ్లీ ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.
More Latest News
ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై ఐక్యరాజ్యసమితి ఆందోళన
18 minutes ago

ఉద్ధవ్ థాకరే గూండాయిజం అంతం కావాలి.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి: నవనీత్ కౌర్
40 minutes ago

నటించకుండానే రణబీర్ కపూర్ కు మొదటి సారి రూ.250 చెక్!
43 minutes ago

ఓటర్ల కంటే రాజకీయ నాయకుల ఆయుష్షు 4.5 ఏళ్లు ఎక్కువ.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
1 hour ago

నాగచైతన్య ‘థాంక్యూ’ రెండు వారాలు వెనక్కి
2 hours ago
