సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

10-04-2021 Sat 07:29
advertisement

*  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితం ఆధారంగా నిర్మించిన 'తలైవి' చిత్రం విడుదల వాయిదాపడింది. వాస్తవానికి ఈ వేసవిలో చిత్రం రిలీజ్ కావాల్సివుంది. అయితే, ప్రస్తుతం కొవిడ్ కేసులు మళ్లీ విజృంభిస్తున్నందున చిత్రం విడుదలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ బయోపిక్ లో బాలీవుడ్ నటి కంగన రనౌత్ జయలలిత పాత్రలో నటించగా, ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటించాడు.
*  పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' చిత్రానికి విదేశాలలో తొలిరోజున కలెక్షన్ల వర్షం కురిసింది. ఓవర్ సీస్ లో మొత్తం 226 లొకేషన్లలో చిత్రాన్ని రిలీజ్ చేయగా, ఒక్కరోజులోనే 296,885 డాలర్లు వసూలు చేసినట్టు చెబుతున్నారు. కాగా, ఈ చిత్రం ఓవర్ సీస్ హక్కులు సుమారు 5 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది.     
*  విజయ్ దేవరకొండ హీరోగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లైగర్' చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతున్నాయి. ముంబైలో ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువవడంతో షూటింగును ఆపేసి, యూనిట్ హైదరాబాదుకు చేరుకుంది. మళ్లీ షూటింగ్ ప్రారంభించే వరకు ఈ గ్యాప్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement