రేపు శిల్ప కళావేదికలో 'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్

03-04-2021 Sat 21:29
advertisement

పవన్ కల్యాణ్ లీడ్ రోల్ పోషిస్తున్న వకీల్ సాబ్ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాదు శిల్ప కళావేదికలో ఈ ఫంక్షన్ జరగనుంది. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే ఈ కార్యక్రమానికి అనుమతి ఇస్తున్నట్టు ఈవెంట్ నిర్వాహకులు వెల్లడించారు. ఫ్యాన్స్ పాసులతో రావాలని, మాస్కు లేకపోతే ప్రవేశం నిషిద్ధం అని స్పష్టం చేశారు. కాగా ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ వస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

బాలీవుడ్ చిత్రం పింక్ ను తెలుగులో మార్పులుచేర్పులతో వకీల్ సాబ్ పేరిట తెరకెక్కించిన సంగతి తెలిసిందే. పవన్ సరసన శ్రుతిహాసన్ నటించగా, అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement