పెరుగుతున్న కరోనా వ్యాప్తి... భక్తులపై టీటీడీ తాజా ఆంక్షలు
29-03-2021 Mon 19:34
- దర్శనం టికెట్లు ఉన్నవారికే కొండపైకి అనుమతి
- ఒకరోజు ముందుగా అనుమతి
- సోమవారం నుంచి తాజా నిబంధనలు అమలు
- తీవ్రంగా ఇబ్బందిపడిన భక్తులు

కరోనా మహమ్మారి మళ్లీ పుంజుకోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులపై మరోసారి ఆంక్షలు విధించింది. స్వామివారి దర్శనం టికెట్లు కలిగిన భక్తులనే తిరుమల కొండపైకి అనుమతిస్తున్నారు. వాహనాల్లో వచ్చేవారికి దర్శనం సమయానికి ఒకరోజు ముందు మధ్యాహ్నం 1 గంట నుంచి కొండపైకి అనుమతిస్తారు. మెట్ల దారిలో వచ్చే భక్తులను దర్శన సమయానికి ముందురోజు ఉదయం 9 గంటల నుంచి కొండపైకి అనుమతిస్తారు.
అయితే ఈ కొత్త నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి రావడంతో ఇవాళ వచ్చిన భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. టీటీడీ తాజా ఆంక్షల గురించి సమాచారం లేని భక్తులు అలిపిరి, మెట్ల మార్గం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకోగా, వారిని విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో భక్తులు టీటీడీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
More Latest News
పండ్ల బండిని తోసిన చిన్నారి విద్యార్థులు.. మహిళకు సాయం చేయడంపై నెటిజన్ల హర్షం.. వీడియో ఇదిగో..
10 minutes ago

కేజ్రీవాల్ ఒక అబద్ధాలకోరు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
21 minutes ago

ఇండియా టుడే-సీ ఓటర్ సర్వేలో ఆసక్తికర ఫలితాలు.... కేంద్రంలో మళ్లీ మోదీనే.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందంటే...!
30 minutes ago

భూమి వైపు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్లు.. నేటి నుంచి ఐదు రోజుల్లో నాలుగు గ్రహ శకలాలు రానున్నట్టు నాసా వెల్లడి
40 minutes ago

రఘురామకృష్ణరాజు పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
39 minutes ago

నా తోడబుట్టిన అన్నతో పాటు దేవుడిచ్చిన ప్రతి అన్నకు, తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు: వైఎస్ షర్మిల
1 hour ago

మూవీ రివ్యూ : 'మాచర్ల నియోజకవర్గం'
1 hour ago

చెయ్యి ఎత్తితే తగిలేంతగా.. బీచ్ పక్కన ఎయిర్ పోర్టులో విమానాల ల్యాండింగ్ కలకలం! వీడియో ఇదిగో..!
1 hour ago
