డీఎంకే ఎంపీ రాజా వ్యాఖ్యలను నేనెప్పుడూ సమర్థించలేదు: కమలహాసన్

29-03-2021 Mon 15:49
Kamal Haasan says he never support DMK MP Raja comments

ఇటీవల డీఎంకే ఎంపీ ఏ.రాజా మాట్లాడుతూ, సీఎం పళనిస్వామిని స్టాలిన్ కాలి చెప్పుతో పోల్చారు. ఇంకా పలువిధాలుగా పళనిస్వామిని కించపరిచే విధంగా విమర్శలు గుప్పించారు. అయితే రాజా వ్యాఖ్యలను ఎంఎన్ఎం పార్టీ అధినేత కమలహాసన్ సమర్థిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారాన్ని కమల్ తాజాగా ఖండించారు. ఎంపీ రాజా వ్యాఖ్యలను తానెక్కడా సమర్థించలేదని స్పష్టం చేశారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కమల్ పై జరుగుతున్న దుష్ప్రచారం పట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎంఎన్ఎం పార్టీ వర్గాలు కూడా హెచ్చరించాయి.


More Telugu News
Chandrababu condemns Budda Venkanna arrest
CM KCR shot a letter to PM Modi
CM Jagan inaugurates EBC Nestam Scheme
Perni Nani slams foreign affairs minister of state
Telangana corona update
CM Jagan camp office with lighting
Nara Lokesh condemns Budda Venkanna arrest
Kodali Nani furious on TDP leaders
Police arrests TDP leader Budda Venkanna
Thank you movie update
Budha Venkanna fires on Kodali Nani
Raghurama replies Vijayasai Reddy tweet
Major movie update
Kavitha counters Bandi Sanjay remarks
PM Modi interacts Pradhan Mantri Bala Puraskar awardees
..more