ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్ తీసుకురావడానికి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర
26-03-2021 Fri 13:34
- ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపనున్న సర్కారు
- స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా జరగని బడ్జెట్ సమావేశాలు
- దీంతో మూడు నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్
- మొత్తం రూ.90వేల కోట్లతో బడ్జెట్

ఏపీ సర్కారు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ ను తీసుకొస్తోంది. ఆర్డినెన్స్‌కు ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కాసేపట్లో ఈ ఆర్డినెన్స్‌ను ఏపీ సర్కారు గవర్నర్‌కు పంపనుంది. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా బడ్జెట్ సమావేశాలు జరగలేదన్న విషయం తెలిసిందే. దీంతో మూడు నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఏపీ సర్కారు తీసుకొస్తోంది.
మొత్తం రూ.90 వేల కోట్లతో బడ్జెట్ ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోద ముద్ర పడింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలతో పాటు పథకాల అమలు, ఇతర వ్యయాల నిర్వహణ కోసం తదుపరి నెలల కాలానికి గాను ఈ ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకువస్తున్నారు. దీంతో ఇక జూన్‌లో నిర్వహించే శాసనసభ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టే అవకాశాలు ఉన్నాయి.
ADVERTSIEMENT
More Telugu News
చివరి మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన ఆర్సీబీ
48 minutes ago

ఐదు భాషల్లో ఎన్టీఆర్ 30వ చిత్రం... కొరటాల శివ దర్శకత్వం... రౌద్రం ఉట్టిపడేలా స్పెషల్ వీడియో
1 hour ago

'అఖండ' సీక్వెల్ కథపై జరుగుతున్న కసరత్తు!
2 hours ago
